భారీ ధర పలికిన రజినీకాంత్ కాలా సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో వరుసగా రెండు ప్లాపులు పలకరించినా ఆయన తాజా కాలా సినిమా భారీ ధరకు శాటిలైట్ హక్కులు కు అమ్ముడుపోయింది. గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమా ఇంత  ధరకు అమ్ముడు పోవడం ట్రేడ్ వర్గాలకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే సినిమా థ్రియేటికల్ రైట్స్ 125 కోట్లకు లైకా ప్రొడక్షన్స్ వారు దక్కించుకున్నారు. చిత్ర నిర్మాత ధనుష్ రీసెంట్ గా శాటిలైట్ రైట్స్ ని కూడా భారీ ఎమౌంట్ కి అమ్మేసినట్లు తెలుస్తోంది.
స్టార్ టీవీ వారు 75 కోట్ల రూపాయలను ఇచ్చి కాలా శాటిలైట్ హక్కులను అందుకున్నారట. ఈ సినిమాని కబాలి దర్శకుడు పా.రంజిత్ డైరెక్షన్ చేశారు. అయితే ఈ క్రమంలో ఈ సినిమాపై రజనీకాంత్ అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 27న ఈ సినిమా విడుదలవుతుంది. లింగా అమ్మాయి సినిమా పరాజయాల తర్వాత వస్తున్న ఈ సినిమాతో  కచ్చితంగా రజనీకాంత్ హిట్ కొడతాడు అని అంటున్నారు రజనీకాంత్ అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here