నా పేరు సూర్య సినిమా ఐటెం సాంగులో బాలీవుడ్ బిగ్ బాస్ భామ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నా పేరు సూర్య’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో దేశ సైనికుని పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. భారీ యాక్షన్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ పక్కన యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఈ సినిమాలో ఒక పాట కోసం బాలీవుడ్ భామ హిందీ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న అల్లి అవరం అనే స్వీడన్ కు చెందిన హాట్ భామను ఈ సాంగ్ కోసం ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపి ఒప్పించారట. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్ లో జరుపుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ నటిస్తుంది. సమ్మర్ కానుకగా ఈ సినిమాని మే 4వ తేదీన విడుదల చేస్తున్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. ఇదిలావుండగా మొన్న నా పేరు సూర్య సినిమాకి సంబంధించి విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో టీజర్ చూసిన అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here