ఆదివారం పెట్రోల్ బంక్ లకి శలవు .. ఉంటుందా ఉండదా ?

వచ్చే నెల 14 వ తారీఖు నుంచీ దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో ఆదివారం పెట్రోల్ బంక్ లు మూసెయ్యాలి అనే ప్రభుత్వ నిర్ణయానికి డీలర్ ల సంఘాలు నో చెప్పేసాయి,ముందు తమ డిమాండ్లు ఓకే చేస్తే ఆ తరవాత ఈ ప్రోపోజల్ కి తాము ఎస్ చెప్పాలా ఒద్దా అనేది ఆలోచిస్తాం అని అంటున్నారు వారు. పెట్రోల్ మీద ఇప్పటికే లీటరు కి ఇస్తున్న రూ.2.56, డీజిల్‌పై ఇస్తున్న రూ.1.65 కమీషన్‌ను పెంచాలని డీలర్ల సంఘాలు గత కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నాయి.

దీనికి సంబంధించి నిర్ణయం 10 మే న రాబోతోంది సో ఇది చూసాకే తమ నిర్ణయం చెబుతాం అంది పెట్రోల్ డీలర్ల సంఘం. మరొక పక్క పెట్రోల్ బంక్ లకి వారాంతపు శలవలు ఉండడం మీద కొందరు పెదవి విరిస్తున్నారు.  ఆదివారం సెలవు అమలు చేస్తే శనివారమే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారని, అంతేకాక బ్లాక్ మార్కెట్‌కు కూడా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here