రవీంద్ర జడేజా ని చూసి పగలబడి నవ్వినా కోహ్లీ :

ఐపీఎల్ సీజన్ లో తాజా సెన్సేషన్ గా రవీంద్ర జడేజా హెయిర్ స్టైల్ కనపడుతోంది. ఆ హెయిర్ స్టైల్ తీసుకున్న మొదటి గంట లోనే ఆ ఫోటో ని ఇంటర్నెట్ లో పెట్టిన జడేజా అందరినీ ఆశ్చర్య పరిచాడు. రెండు రకాల స్టిల్స్ పెట్టిన మనోడు విభిన్నంగా కనిపిస్తున్నాడు. అయితే ఆ హెయిర్ స్టైల్ ని బెంగళూర్ – గుజరాత్ మ్యాచ్ కి ముందర జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో కోహ్లీ చూసాడు . చూసీ చూడడమే పడీ పడీ నవ్వేసాడు , అది చూసిన వెంటనే కెమెరా మ్యాన్ క్షణం కూడా ఆలాస్యం చెయ్యకుండా క్లిక్కు కొట్టేసాడు.

ఒక్క కోహ్లీ నే కాదు బెంగళూరు , గుజరాత్ టీం ల ప్లేయర్ లు అందరూ కూడా జడేజా ని తేరిపారా చూసారు. కోహ్లీ ని అందరూ సాధారణంగా పలకరిస్తున్న టైం లో జడేజా వింత స్టైల్ చూసి కోహ్లీ గట్టిగా నవ్వేసాడు. కోహ్లీ నవ్వడం తో వెంటనే అతనికి గుజరాత్ బౌలర్ ప్రవీణ్ కుమార్ జత కలిసి ఇంకా రచ్చ మొదలు పెట్టారు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. అండర్ 19 భారత జట్టుకు ఆడినప్పటి నుంచి కోహ్లీ జడేజా స్నేహితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here