అంత్య క్రియల కోసం ముప్పై మూడు కోట్లు .. రికార్డ్ బ్రేక్

గుజరాత్ లో జైన గురువు జయంత్ సేన్ సురీస్వర్ మహారాజ్ సాహెబ్ అంత్యక్రియలు ఎవరు నిర్వాహణ చెయ్యాలి అనే విషయం మీద వేలం పాట జరిగింది. గుజరాత్ కి చెందిన వ్యాపారు ఒకరు , ఒకటి కాదు రెండు కాదు ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టి ఈ అంత్యక్రియలు నిర్వహించడం కోసం ముందుకు వచ్చాడు. ఎనభై సంవత్సరాల మహారాజ్ సాహెబ్ ఈ మధ్యనే మరణించారు. అయితే ఆయన పార్ధివ దేశానికి కొరివి పెట్టె అవకాశం కోసం వేలం పాట వేసారు.
ఆఖరి స్నానం చేయించడం, గంధం పూయడం వంటి ఇతర కార్యక్రమాలు చేసేందుకు వేసిన వేలంలో రికార్డు స్థాయిలో రూ. 57 కోట్లు పోగయ్యాయి. జైన సాంప్రదాయం ప్రకారం ఎవరైనా గురువు మరణిస్తే ఆ వ్యక్తి అంత్య క్రియల కోసం దేశ విదేశాల నుంచి వేలాది మంది తరలి వస్తారు. ఆ గురువు కి ఉన్న అనుచరులు , శిష్యులు లెక్కని బట్టి అంత్య క్రియల కోసం డిమాండ్ పెరుగుతుంది.
ఇక ఎంత మందికి జైన దీక్షను ఇచ్చారన్న సంఖ్యపైనా సదరు గురువు పేరు ప్రఖ్యాతులు ఆధారపడి వుంటాయి. మహారాజ్ సాహెబ్, సుమారు 200 మందికి దీక్షను ఇచ్చారని ఆయన శిష్యులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here