బ్రహ్మానందం మీద తెలంగాణా స్పీకర్ పొగడ్తలు

తెలంగాణా స్పీకర్ మధుసూధనాచారి ప్రముఖ సినిమా ప్రముఖుడు బ్రహ్మానందం మీద ప్రసంసల జల్లు కురిపించారు. అన్ని భావాలనీ స్పష్టంగా గొప్పగా వ్యక్తీకరించే గొప్ప అవకాశం కేవలం మానవులకి మాత్రమే ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన ” నవ్వించడం మానవజాతికి మాత్రమే ఉన్న గొప్ప వరం, నవ్వడమూ మన వరమే. ఎంత సమస్యలలో ఉన్న వారినైనా నవ్వించగలిగే సత్తా ఉన్న బ్రహ్మానందం దొరకడం మనకి వరం” అన్నారు ఆయన.
సర్వరోగాలనీ హాస్యం నయం చేస్తుంది అనీ అందరినీ ఆరోగ్య వంతులుగా చేస్తున్న క్రెడిట్ అంతా కూడా బ్రాహ్మీ ఎకౌంటు లో పడుతుంది అని కొని యాడారు. రవీంద్ర భారతి లో ఛార్లె చాప్లిన్ యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.బ్రాహ్మీ కి చార్లీ చాప్లిన్ ఇంటర్నేషనల్ అవార్డ్ అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిదిగా వచ్చిన తెలంగాణా స్పీకర్ మధుసూధనాచారి ఈ వ్యాఖ్యలు చేసారు. తెలుగు వారిని నవ్వించడం కోసమే బ్రహ్మానందం పుట్టాడు అన్నారు ఆయన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here