బాహుబలి కి పోటీ సినిమా సిద్దం చేసిన బాలీవుడ్

సుల్తాన్ తరవాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ట్యూబ్ లైట్ కి సంబంధించి చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పదింతలు పెంచేస్తూ సల్లూ భాయ్ కొత్త సినిమా ట్యూబ్ లైట్ కొత్త లుక్ వచ్చేసింది. భజరంగీ భాయ్ జాన్, సుల్తాన్ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర పాగా వేసిన సల్లూ భాయ్ ఫస్ట్ లుక్ తో ఫాన్స్ కి కిక్కు ఎక్కించాడు. కబీర్ ఖాన్ డైరెక్షన్ లో సల్మాన్ ఇప్పటికే ఎక్ థా టైగర్ , భజ్రంగీ సినిమాలు తీసాడు. ఈ రెండూ కూడా చాలా పెద్ద హిట్లు గా నిలిచాయి.
ఈ కొత్త సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచీ ఎలాంటి అంశాలు లీక్ కాకుండా జాగ్రత్తపడ్డ కబీర్ ఖాన్ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ ను విడుదల చేశారు. దీపావళికి విడుదల కానున్న ఈ ‘ట్యూబ్‌ లైట్‌’ ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకుంటోంది. అయితే త్వరలో విడుదల అవ్వబోతున్న బాహుబలి కి ఈ చిత్రం పోటీ గా చెబుతున్నారు. బాహుబలి విడుదల అయ్యి పాత బాలీవుడ్ రికార్డులు అన్నీ తిరగరాస్తుంది అనీ చెబుతున్నారు. యుద్ధ నేపధ్యం లో వచ్చే ఈ సినిమా ఈద్ లో విడుదల అవ్వబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here