పూనమ్ సెక్సీ యాప్ ను.. గూగుల్ బాన్ చేసింది

హీరోయిన్ గా కాకున్నా.. తన హాట్ అప్పీల్స్ తో హ్యూజ్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న సెలెబ్రిటీ పూనమ్ పాండే. రోజుకో హాట్ పిక్ తో.. సెమీ న్యూడ్ స్టిల్స్ తో ఫ్యాన్స్ కు పిచ్చెక్కించడం ఆమె హాబీ. ఆ అలవాటును ఇప్పుడు మరింత అడ్వాన్స్ చేసింది పూనమ్. తన పేరుతో ఓ యాప్ రూపొందించి.. గూగుల్ ప్లే స్టోర్ లో అప్ లోడ్ చేసింది. అది డౌన్ లోడ్ చేసుకోవాలని అభిమానులను కోరింది. అలా అడగ్గానే.. 15 నిముషాల్లో 15 వేలమంది పూనమ్ యాప్ ను డౌన్ లోడ్ చేశారు.

కానీ.. గూగుల్ ఇండియా.. ఆ యాప్ పై అభ్యంతరం చెప్పింది. డౌన్ లోడ్స్ ను ఆపేసింది. అడల్ట్ కంటెంట్ ఉందని అభ్యంతరం చెప్పింది. దీనిపై పూనమ్ సీరియస్ అయ్యింది. అడల్ట్ కంటెంట్ ఉన్న చాలా యాప్ లు.. ప్లే స్టోర్ లో ఉన్నాయని.. అలాంటిది.. తన యాప్ లో కనీసం న్యూడ్ ఫొటోలు లేవని ఫ్యాన్స్ కూడా చెబుతున్నారని పూనమ్ సీరియస్ అయ్యింది. గూగుల్ ఇలా చేయడం మంచిది కాదని ఫైర్ అవుతోంది.

మరోవైపు.. పూనమ్ ఫ్యాన్స్ కూడా యాప్ వర్క్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here