యోగా, సూర్యనమస్కారాలకు పెరుగుతున్న క్రేజ్‌

ఫిట్‌నెస్‌ కోసం ఒక్కొక్కరు ఒక్కో పద్దతిని ఫాలో అవుతుంటారు.  అందమైన ఫిట్ బాడీ  కోసం  జుంబా, ఎరొబిక్స్‌,  జిమ్ముల చుట్టు ప్రదక్షణాలు చేస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అత్యాధునిక పద్దతులు వచ్చిన  ట్రెడిషినల్‌  యోగాలోని సూర్యనమస్కారాలకే ఓటేస్తున్నారు. పురాణాల నుంచే ఆచారిస్తున్న ఆరోగ్య సూత్రం సూర్యనమస్కారాల స్పెషల్‌ ఏంటో తెలుసుకుందాం.

యోగాలో కొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తున్నాయి.  స్లిమ్‌తో పాటు హెల్తీగా ఉండేందుకు యువత యోగా బాట పడుతున్నారు. యోగాలో భాగమైన సూర్య నమస్కారాలకు క్రేజ్‌ పెరుగుతుంది.  ఫిట్‌నెస్‌ కోసం కొత్త కొత్త  ఆసనాలను ట్రై చేస్తున్నారు. ఈ ట్రెడిషన్‌ యోగాను దేశ విదేశాల్లో  ఫాలో అవుతున్నారు.

యోగా వల్ల కలిగే లాభాలను తెలియజేయడానికి అనంత యోగా సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో బొటానికల్‌ గార్డెన్స్‌లో 108 సూర్య నమస్కారస్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో  సిటీవాసులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు.

బిజీ లైఫ్‌లో  పెరుగుతున్న  ఆరోగ్య సమస్యలకు సూర్య నమస్కారాలతో  చెక్‌ పెట్టవచ్చంటున్నారు నిర్వాహాకులు. గైనిక్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, వెయిట్ కంట్రోల్ తో పాటు కాన్సంట్రేషన్ పెరుగుతుందంటున్నారు.

యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు బీపీ, షుగర్ లాంటి రోగాలకు దూరంగా కావచ్చు. అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే  సూర్య నమస్కారాలను  ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు.

అడ్డదిడ్డంగా ఫాస్ట్‌ఫుడ్‌ తిని లావెక్కే వారు ఆలస్యం చేయకుండా… సూర్యనమస్కారాలు ఫాలో  అవ్వడం బెటర్‌. జిమ్ లో చేసే ప్రతి ఎక్ససైజ్ అందులో ఉండటంతో  యువత కూడా ఫాలో అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here