తెలంగాణా లో ట్విట్టర్ పాలన భేష్ సూపర్

తెలంగాణా రాష్ట్ర ఐటీ , మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కి ఇప్పుడు ప్రతీ జిల్లా కలక్టర్ ట్విట్టర్ లో ఫాలో అవుతూ ఉండాలి. ఎందఱో మంత్రులు ఉండగా కేటీఆర్ ని నిత్యం ఫాలో అవుతూ ఉండమని ఆదేశాలు రావడం విశేషం. తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణం లో కొత్త నిర్ణయం ఇప్పుడు మంచి ఫలితాలు ఇవ్వ బోతోంది. ఐటీ కి పెద్ద పీట వేసి కొత్త తరహా లో పాలన సాగించాలి అనే కేటీఆర్ ప్లాన్ కి కలక్టర్ ల సపోర్ట్ కావాలి మరి. జిల్లాల్లో ప‌రిపాల‌న బాధ్యులు అయిన క‌లెక్ట‌ర్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారిక ఖాతాల‌ను ఏర్పాటు చేసింది.

వాటిని ప్ర‌జా బాహుల్యానికి చేర‌వేసి త‌ద్వారా నూత‌న పంథాకు శ్రీ‌కారం చుట్టింది. జిల్లా స్థాయి లో సమస్యలు ఉన్నప్పుడు కలక్టర్ లు అందరూ ఆన్ లైన్ లో వచ్చిన అభ్యర్ధన ని ఎప్పటికప్పుడు పరిశీలించి ఆయా శాఖలకి చేర వేస్తారు. ప్రభుత్వ పథకాలు, క్షేత్రస్థాయిలో పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పథకాల మార్గదర్శకాలు ఇలా సమస్త సమాచారం ఇకపై సులువుగా తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here