ఈ ఫోన్ బ్యాటరీని 12ఏళ్లు వాడుకోవచ్చు..ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 16నెలలు వస్తుంది

ఉక్రేయిన్ కు చెందిని సైంటిస్ట్ వ్లాడిస్లావ్ కెస్లేవ్. అందరిలా ఆలోచిస్తే మనం ఈయన గురించి మాట్లాడుకునేవాళ్లం కాదేమో. ఎందుకంటే ప్రపంచం మొత్తం గుర్తించేలా పరిశోధనలు చేసి అందర్ని తనవైపుకు తిప్పుకున్నాడు. ఇలా  ఎందుకు చేయాలనిపించిందో తెలీదు కానీ తనకున్న అపారమైన తెలివితేటలతో టెక్నాలజీలో నూతన ఒరవడిని సృష్టించాడు. బిజీకాలంలో మనికి ఫోన్ అవసరమో అందరికి తెలిసిందే.

అన్నం లేకుండా బ్రతకగలడేమో కానీ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేడు. ఒకవేళ మరిచి పోయినా ఏదో పోగొట్టుకున్నామనే  ఫీలింగ్ కలుగుతుంది. ఆలాంటి ఫోన్ ఉపయోగం పై పరిశోధనలు చేసిన కెస్లేవ్ లైఫ్ టైం బ్యాటరీలను తయారు చేశాడు. అవి అలాంటి ఇలాంటి బ్యాటరీ కాదు.  మనం వాడే ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఎన్నిరోజులు వస్తుంది. వాడుకునే దాన్ని బట్టి వారం రోజులు, నాలుగు రోజులు వస్తుంది. అయితే ఈ బ్యాటరీ మాత్రం ఒక్కసారి చార్జింగ్ పెడితే 16నెలల పాటు వాడుకోవచ్చు. అలా ఈ బ్యాటరీని 12సంవత్సరాల పాటు వినియోగించుకోవచ్చు. మెటల్ , టీటీఎం సాయం తో తయారు చేసిన ఈ బ్యాటరీ అద్భుతాలు సృష్టిస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here