చదువు రాకపోతే స్కూళ్లపై కేసులు పెట్టొచ్చు

పిల్లల చదువులకు లక్షలు ఖర్చుపెడుతున్నారా? లక్షలు పెట్టి స్కూల్‌కు పంపిస్తే… పిల్లాడికి అంతంత మాత్రమే చదువొస్తుందా? మీ పిల్లాడికి మార్కులు రావడం లేదని కోప్పడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి చదువు చెప్పిన స్కూల్‌పై కేసు పెట్టొచ్చు?
ఇప్పుడన్నీ గ్లోబల్ చదువులే. ఏరియాకో ఇంటర్నేషనల్ స్కూల్. ఎలిమెంటరీ నుంచే ఐఐటీ ఫౌండేషన్. లక్షల్లో డొనేషన్లు…. వేలల్లో ఫీజులు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివించడం ఇప్పుడో ప్రిస్టేజీ. లక్షలు కట్టి మరీ పేరున్న స్కూల్స్‌లో పిల్లల్ని చేర్పిస్తున్నారు చాలా మంది పేరెంట్స్.
విద్య వ్యాపారం అయ్యాక… స్కూల్ ఫీజులు కూడా పెట్టుబడి కింద లెక్కే. వేలు లక్షలు పెట్టి చదివిస్తే… తీరా పాస్ మార్కులే వస్తే… లాభమేంటి?
 మన పిల్లాడు సరిగా చదవడం లేదని కోప్పడి సరిపెట్టుకుంటుంటారు కొందరు. కానీ, ఇప్పుడా అవసరం లేదు. మార్కులు సరిగా రావడం లేదని మీ పిల్లాడ్ని నిందించాల్సిన పని లేదు. మీ పిల్లాడికి చదువు చెప్పిన స్కూల్‌పై కేసు పెట్టొచ్చు.   తాజాగా కేంద్రం విద్యాహక్కు చట్టం నిబంధనల్లో మార్పులు చేసింది. మార్కులు సరిగా రాకుంటే చదువు చెప్పిన స్కూళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఇచ్చింది. కోర్టులో కేసు కూడా వేయొచ్చని విద్యాహక్కు చట్టంలో చెబుతోంది. ఫిబ్రవరి 20 నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. జమ్ము-కశ్మీర్‌ మినహా అన్ని రాష్ట్రాలకూ ఇవి వర్తిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here