జియో ని వదిలేస్తున్న కస్టమర్ లు .. షాకింగ్ వార్త :

రిలయన్స్ జియో అంటే మోజు తీరిపోయిండా ? మొన్నటి వరకూ జియో సిం ఉంటె రారాజు లు లాగా ఫీల్ అయిన ఒక్కొక్కరూ నెమ్మదిగా ఇప్పుడు జియో నుంచి సైడ్ ఐపోతున్నారా ? నిజమనే అంటున్నాయి గణాంకాలు. జియో వద్దు అంటూ పాత సర్వీస్ కోసమే ఎగబడుతున్నారు చాలా మంది .  ఇదే సమయంలో జియో పుణ్యమాని మిగతా టెలికం సంస్థల డేటా రేట్లు కూడా దిగిరావడంతో కస్టమర్లు జియోను వీడుతున్నట్టు తెలుస్తోంది. ఐడియా , ఎయిర్టెల్ , వోడా ఫోన్ నుంచి వెళ్ళిపోయినా ఖాతా దారులు మళ్ళీ వెనక్కి వచ్చారు అని చాలా మంది నెట్వర్క్ వారు చెబుతున్నారు.

ఐడియా సెల్యులర్ ఓపెన్ గా ఈ విషయం చెప్పుకొచ్చింది .  ఆ సంస్థ మానేజింగ్ డైరేక్టర్ మాటల ప్రకారం జియో కోసం వెళ్ళిన కస్టమర్ లు వెనక్కి వస్తున్నారు. చార్జీల వసూళ్లు ప్రారంభించిన తరువాత డేటా కస్టమర్లు జియో నెట్ వర్క్ ను వీడుతున్నారని ఆయన అన్నారు. తొలి త్రైమాసికంలో రెవెన్యూ వృద్ధిని తాము ముందుగానే ఊహించామని, జనవరి – మార్చి నష్టాల నుంచి ఈ సంవత్సరం 15 శాతం రికవరీ సాధిస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here