కెసిఆర్ డబల్ బెడ్ రూమ్ హామీ గాల్లో కలిసిపోయినట్టే ?

డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ గురించి తెలంగాణా లో ఎప్పటి నుంచో పెద్ద చర్చ సాగుతోంది. ప్రజల దగ్గర నుంచి అనేక దరఖాస్తులు సైతం వస్తూ ఉండడం తో విసిగిపోయిన హైదరాబాద్ కలక్టర్ రాహుల్ దీని గురించి ఓపెన్ అయిపోయారు. ఇళ్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన తెలిపారు . ” ఇళ్ళ దరఖాస్తులు త్వరలో తీసుకుంటారు కానీ కాస్తంత ఆగాలి.
కంగారు పడద్దు, ప్రభుత్వం ఇంకా ఆ విషయం మీద మనసు పెట్టలేదు .. త్వరలో ఉత్తర్వులు రాగానే దరఖాస్తులు తీసుకుంటాం ” అన్నారు కలక్టర్. ఈయన మాటలు బట్టి చూస్తుంటే ఇప్పట్లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు జనాలకి వచ్చేలా కనపడ్డం లేదు. కెసిఆర్ తనదైన స్టైల్ లో ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయి నట్టేనా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here