అచ్చం పవన్ కళ్యాణ్ – రేణూ దేశాయ్ లాంటి మరొక జంట .. విడిపోయి కూడా.

ఒక జంట విడాకులు గనక తీసుకుంటే ఏం చేస్తారు? జన్మలో ఒకరి మొఖాలు ఒకరు చూసుకోకూడదు అనుకుంటారు. విడిపోవడమే మంచిది అయ్యింది అని వేరేవారితో బతికేస్తారు. కానీ కొందరు మాత్రం భలే షాకింగ్ గా ప్రవర్తిస్తారు . తామిద్దరి మధ్యన ఏమీ జరగనట్టే ఉంటారు వారు. పిల్లల కోసం విడిపోయిన భార్యాభర్తలు స్నేహితులుగా కొనసాగవచ్చని, పిల్లల ఆనందం కోసం తరచుగా కలుస్తూ వారికి తల్లిదండ్రులతో సమయం గడిపిన ఆనందాన్ని పంచి ఇవ్వవచ్చునని పవన్‌కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ చూపెడుతున్నారు.

ఇది టాలీవుడ్ లో అయతే బాలీవుడ్ లో హృతిక్‌ రోషన్‌, సుసానే ఖాన్‌ కూడా విడిపోయిన జంటలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయినా కుటుంబానికి చెందిన పెళ్ళిళ్ళు ఫంక్షన్ లలో కలిసి కనిపిస్తున్నారు ఇద్దరూ . తాజాగా వీరిద్దరూ ఒక డిన్నర్‌ మీట్‌లో కలుసుకున్నారు. ఈ మీట్‌కి హృతిక్‌ తండ్రి, స్నేహితులు కూడా హాజరయ్యారు. అయితే పవన్‌ మాదిరిగా ఇంకా హృతిక్‌ పెళ్లి చేసుకోకపోవడంతో ఈ జంట మళ్లీ ఒకటవుతారేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here