పవన్ కళ్యాణ్ తో ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు ఎన్టీఆర్ ని ఇబ్బంది పెడుతున్నాడు

సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ కి పవన్ కళ్యాణ్ బోలెడంత ఫ్రీడం ఇచ్చాడు అని మొదటి నుంచీ చెప్పుకొచ్చారు. పవన్ తో డైరెక్టర్ అంటే ఎవ్వరైనా పేరు కాస్త తక్కువలో పెట్టుకోవాలి. నేనే ఈ సినిమాకి డైరెక్టర్ ని అని చెప్పుకోవాల్సిందే అంతగా పవన్ సినిమా లో వేలు పెడతాడు మరి. పవన్ సర్దార్ కోసం ఆర్థర్ విల్సన్ ని కెమెరా కి పెట్టుకుంటే అతన్ని తీసేసాడు బాబీ. జై లవకుశ కి కూడా అదే పరిస్థితి వచ్చింది . మురళీ ని మార్చేసి చోటా కే నాయుడు ని తీసుకొచ్చాడు. మురళీ జాతీయ స్థాయి లో పేరున్న సినిమా కెమెరా పర్సన్ అయినా కేవలం ఇగో వల్లనే బాబీ మరోకడిని పట్టుకొచ్చాడు.

ఇంత ఖరాఖండీగా వ్యవహరించే బాబీ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ విషయంలో మాత్రం ఎందుకంతగా రాజీ పడిపోయాడో అని మాట్లాడుకుంటున్నారు. పవన్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకునే బాబీ పవన్ కోసం కాంప్రమైజ్ అయ్యాడో లేక పవన్ తో పెట్టుకుంటే భవిష్యత్తు నాశనం ఎందుకులే అని ఊరుకున్నాడో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here