ఒక్క సినిమా అరవై ఆరు మంది నిర్మాతలు .. వింతల్లో వింత :

ఒక సినిమా కి ఒకరో ఇద్దరో ప్రొడ్యూసర్ లు ఉంటారు. చిన్న చిత్రం అయితే ఒకరు కాస్తంత పెద్ద చిత్రం అయితే మరొక ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఉంటారు. కానీ ఒక సినిమా కొత్తగా మొదలు అవుతోంది దానికి ఒకరు కాదు ఇద్దరు కాద ఏకంగా అరవై ఆరు మంది నిర్మాతలు. ‘బాబు సాఫ్ట్ వేర్’ పేరుతో రూపొందుతున్న ఒక సినిమాను 66 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు పెట్టుబడిదారులుగా మారి నిర్మిస్తున్నారు. పీపుల్స్ సినిమా అనే పేరు పెట్టుకుని ఒక బ్యానర్ లో ఈ సినిమా తీస్తున్నారు.

ఈ సినిమా నిర్మాతల లెక్కలో కొత్త రికార్డు స్థాపించినట్టు అయ్యింది.ప్రేమ, వినోదం, సస్పెన్స్‌ ఇవన్నీ కలగలిపి ఉంటాయని ఈ సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమవుతున్న సురేష్ అడ్డాల తెలిపారు.  యశ్వంత్ హీరోగా రాబోతున్న ఈ సినిమా లో ట్వింకిల్ అగర్వాల్ హీరోయిన్ గ కనిపిస్తున్నారు. షూటింగ్ కూడా జరుగుతోంది. త్వరలో అంటే జూలై లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here