టోల్ గేటు దగ్గర రచ్చ రచ్చ

త‌న‌ను టోల్‌ ఫీజ్ అడ‌గ‌వ‌ద్దంటూ ఓ ఉద్యోగినిపై ఓ వాహ‌న‌దారుడు దాడి చేసిన ఘ‌ట‌న గుర్గావ్‌ ఎక్స్‌ప్రెస్ హైవేపై చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. త‌న విధులు నిర్వ‌హిస్తోన్న ఉద్యోగిని.. అందరి వ‌ద్ద టోల్ ఫీజులు తీసుకుంటోంది. అందులో భాగంగానే టోల్ ఫీజు ఇవ్వాల‌ని ఓ వాహ‌న‌దారుడిని అడిగింది. అంతే.. సదరు వ్యక్తికి కోపం వ‌చ్చేసింది.
తాను లోక‌ల్ అంటూ, త‌న‌కు టోల్‌ ఉండదంటూ ఆమెని కొట్టాడు. టోల్‌ ప్లాజా ఉద్యోగులపై బూతు పురాణం అందుకున్నాడు. దీంతో అత‌డిని ప‌ట్టుకోవ‌డానికి టోల్‌ ఉద్యోగులం‍తా ముందుకు రావ‌డంతో ఆ వ్య‌క్తి అక్కడనుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయిన‌ప్ప‌టికీ సెక్యూరిటీ సిబ్బంది కారుకు బారీకేడ్లు అడ్డుపెట్టడంతో అత‌డు దొరికిపోయాడు. ఆ వ్య‌క్తిని సెక్యూరిటీ సిబ్బంది పోలీసుల‌కు అప్ప‌జెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here