ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్

టీబీహెచ్ అనే సోష‌ల్ మీడియా ప్ర‌శ్న‌ల యాప్‌ను చేజిక్కించుకున్న త‌ర్వాత ఆ యాప్ సేవ‌ల‌ను త‌మ వెబ్‌సైట్‌లో ఫేస్‌బుక్ ప్ర‌వేశ‌పెట్టింది. ‘Did You Know?’ పేరుతో ఈ ఫీచ‌ర్‌ను సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ప్ర‌వేశ‌పెట్టింది. వెబ్‌సైట్‌లోనూ, యాప్‌లోనూ ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ‘మీ జీవితంలో మంచి రోజు?’, ‘మీరు ఎందులో నిష్ణాతులు అవ్వాల‌నుకుంటున్నా‌రు?’ వంటి ప్ర‌శ్న‌లు అడుగుతూ ప్రొఫైల్ నాణ్య‌త‌ను పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.
ఈ స‌మాధానాల‌ను కావాల‌కుంటే స్నేహితుల‌తో షేర్ చేసుకునే అవ‌కాశాన్ని కూడా క‌ల్పించింది. రానున్న రోజుల్లో వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు సంబంధించి కొన్ని లోతైన ప్ర‌శ్న‌ల‌ను కూడా ఫేస్‌బుక్ అడ‌గ‌బోతుంద‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి మాత్రం ఆస‌క్తి క‌లిగించే ప్ర‌శ్న‌లను మాత్ర‌మే అడుగుతోంది. ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఎడ‌మ వైపు కింది భాగంలో ఈ ఫీచ‌ర్‌ను చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here