13 సంవత్సరాల క్రితం మొగుడ్ని చంపేసింది

భ‌ర్త‌ను చంపిన ఓ మ‌హిళ 13 ఏళ్ల త‌రువాత పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని పల్గ‌ర్ జిల్లా బోయిసర్‌లో చోటు చేసుకుంది. ఫరీదా భారతి అనే మహిళ అప్ప‌ట్లో త‌న‌ భర్తను హత్య‌చేసి త‌మ‌ ఇంటి వెనుక సెప్టిక్ ట్యాంక్‌లో ప‌డేసింది. ఆ త‌రువాత ఆమెపై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ కేసు ముందుకు సాగ‌లేదు. అప్ప‌టి నుంచి అదే ఇంట్లో ఆమె సెక్స్ రాకెట్ నడుపుతూ వ‌స్తోంది.
తాజాగా ఆ ఇంట్లో వ్యభిచారం సాగుతోందన్న ఆరోపణలు రావడంతో, పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. నలుగురు యువతులకు విముక్తి కల్పించి, ఇంటి మొత్తాన్ని పరిశీలించారు. ఈ క్ర‌మంలో సెప్టిక్ ట్యాంక్‌లో ఓ ఆస్థిపంజరం దొరకడంతో పోలీసులు ఆమెను విచారించగా, తన భర్తను హత్య చేసి అక్కడ పారేసినట్టు ఆమె అంగీకరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here