నేను చావలే..నన్ను చంపకండి : బ్రతికున్నపాకిస్థాన్ యాంకర్ ను చంపేశారు.

 నేను చావలే..నన్ను చంపకండి అంటూ పాక్ జర్నలిస్ట్  వేడుకుంటుంది. అంతేకాదు తాను ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నానని, నేను చావలేదు…బాగానే ఉన్నానంటూ కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. విషయం ఏంటంటే పాకిస్థాన్ కు చెందిన హిజ్రాఖాన్ అనే యాంకర్ స్థానికంగా ఉండే 99ఛానల్ లో పనిచేస్తుంది. అయితే పాకిస్థాన్ లోహర్ లో తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ అనే పార్టీ
పాకిస్తాన్ ఎహ్తేస్యాబ్ ర్యాలీ నిర్వహిస్తుంది.
ఆ ర్యాలీని  కవర్ చేసేందుకు వెళ్లిన యాంకర్ ఓ పొడవైన క్రైన్ ఎక్కి ర్యాలీ గురించి, నేతల ఏం మాట్లాడింది అనే దానిపై విశ్లేషిస్తుంది. ఆ సమయంలో హిజ్రాఖాన్ ఏమైందో తెలీదు కానీ..చనిపోయినట్లుగా పట్టుతప్పి కిందపడింది. దీంతో పక్కనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే జర్నలిస్ట్ పడిన మూమెంట్ చూసి ఆమె చనిపోయిందని అనుకున్నారు. ఆమె పడే సమయంలో కొందరు వీడియోలు తీసి మీడియాలో పెట్టడంతో జర్నలిస్ట్ యవ్వారం వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు.
ఆమెకు జరిగిన సంఘటన పై పెద్ద ఎత్తున కథనాల్ని ప్రచురించాయి కొన్ని మీడియా సంస్థలు. అయితే ఆస్పత్రిలో చేరిన యాంకర్ ప్రాణాలతో భయటపడింది. తనకేం కాలేదని స్పృహ తప్పి పడిపోయానని చెప్పుకొచ్చింది. తనపై వస్తున్న రూమర్ గురించి స్పందించిన మహిళా జర్నలిస్ట్ నేను బాగున్నాను. నన్నుచంపకండి. మీ అభిమానానికి నాజోహార్లు అంటూ కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here