అతని నాలిక తీసుకుని రండి – యాభై లక్షలు తీసుకెళ్ళండి .. ఇదెక్కడి ఆఫర్

దేనిగురించి అయినా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వాళ్ళ తల పట్రండి , వాళ్ళ కాళ్ళు పట్రండి , వాళ్ళ కళ్ళు పట్రండి అంటూ కొత్త సంస్కృతి ఒకటి మొదలైంది. ఆ మధ్యన సోనూ నిగం విషయం లో కూడా ఇదే జరిగింది. ఉత్తర ప్రదేశ్ మాజీ మంరి ఆజం ఖాన్ ఆర్మీ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. అస్సాం , కాశ్మీర్ , జార్ఖండ్ లాంటి రాష్ట్రాలలో ఆర్మీ వాళ్ళు ఆడవాళ్ళ మీద గ్యాంగ్ రేప్ లు చేస్తున్నారు అంటూ రచ్చ జరుగుతోంది.

ఆయన ఆ విషయాలు అన్నీ చెబుతూ మహిళల మీద దారుణాలు జరిపే సైనికులని గుర్తించి వారి మర్మాంగాలు కోసెయ్యాలి అని అన్నారు దాంతో దేశ వ్యాప్తంగా రచ్చ మొదలైంది. ఆయన మీద దేశ ద్రోహం కేసు కూడా పెట్టారు. వీహెచ్పీ ఒక అడుగు ముందరకి వేసి ఆయన నాలుక కోసి తీసుకుని వస్తే యాభై లక్షలు ఇస్తాం అని ప్రకటించింది. విశ్వ హిందూ పరిషత్ వారికి ఈ రకమైన ప్రకటనలు చెయ్యడం కొత్తేమీ కాదు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here