” ఎమ్మెల్యే రోజా ఎవరు డబ్బులిస్తే వారి పార్టీలోకి వెళుతుంది .. “

వైకాపా ఎమ్మెల్యే రోజా ఇప్పుడు వివాదాల లో మునిగి తేలుతున్నారు. ఆమె చర్య లేకుండా నే ఆమె మీద అనేక రకాల వార్తలు బయటకి వస్తున్నాయి. ఆమె త్వరలో వైకాపా ని వదిలేసి వెళుతున్నారు అనీ ఆమె కెరీర్ ఇక జనసేన లోనే అంటూ రకరకాల విశ్లేషణలు వినిపిస్తూ ఉన్న తరుణం లో టీడీపీ ఎమ్మెల్యే వర్మ చేసిన వ్యాఖ్యలు ఇంకా దారుణంగా ఉన్నాయి .”

ఆమె డబ్బులు ఇస్తే ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళుతుంది. ఆమెకి పార్టీ ముఖ్యం కాదు ప్యాకేజీ ముఖ్యం. అప్పట్లో జగన్ దగ్గర ప్యాకేజీ మాట్లాడుకుని పది కోట్లు తీసుకుంది ” అంటూ తీవ్ర ఆరోపణలు చేసారు ఆయన. ” మా నాయకుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ని విమర్శించే హక్కు రోజాకి ఎక్కడ ఉంది ? డబ్బులు ఎవరిస్తే వారి వైపు వెళుతుంది. ఐరన్ లెగ్ రోజా వల్లనే జగన్ ఇప్పటికీ ప్రతిపక్షం లో ఉన్నాడు. రానున్న ఎన్నికల్లో ఆమె వలన అది కూడా దక్కదు ” అన్నారు ఆయన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here