కుంబ్లే ని దెప్పి పొడుస్తున్న గంగూలీ.

మాజీ ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు కొన్ని చేసాడు. కుంబ్లే – కోహ్లీ మధ్యన ఉన్న విభేదాలు సరిగ్గా సెట్ చెయ్యడం లో బీసీసీఐ ఫెయిల్ అయ్యింది అని చెప్పిన గంగూలీ తాజాగా ఆ వివాదం మీద మాట్లాడుతూ కోచ్ కి నైపుణ్యం మాత్రమె ఉంటె చాలదు అనీ ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలిసి ఉండాలి అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇన్ డైరెక్ట్ గా కుంబ్లే కి తగులుతున్నాయి.

కెప్టెన్ కి మాత్రమే ఫుల్ పవర్స్ ఉంటాయి అంటున్న గంగూలీ కోచ్ పని మాత్రం గేమ్ ని ముందరకి తీసుకుని వెళ్ళడం లో సహాయం చెయ్యడమే అంటున్నాడు. ” ప్రెజెంటేషన్ ఇవ్వడం కాదు కోచ్ అంటే. ఎవరితో ఎలా మెలగాలో తెలుసుకోవాలి. భారత జట్టు ని చాలా ఎత్తుకు తీసుకుని వెళ్ళడం కోసమే అందరూ ప్రయత్నాలు చెయ్యాలి తప్ప గిల్లి కజ్జాలకి ఇది టైం కాదు ” అన్నాడు గంగూలీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here