హీరోయిన్ కేసు .. హీరో పోలీసుల దగ్గర ..

ప్రముఖ మలయాళ నటి రేప్ కేసు మీద కేరళ ప్రభుత్వం వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు సినిమా హీరో దిలీప్ ని 12 గంటల పాటు విచారణ చేపట్టింది. దిలీప్ తో పాటు మరొక నటుడు నాదిర్షా వారిద్దరి మేనేజర్ లని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అర్ధరాత్రి ఒంటిగంట తరవాత వారిని ఇంటికి పంపించారు కూడా. ఈ కేసు వెనుక దిలీప్ ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ” పోలీసులకి నేను పూర్తిగా సహకరించి మాట్లాడాను. నాకు తెలిసింది మొత్తం చెప్పాను. పోలీసులకి కావలసింది అంత అడిగారు తెలుసుకున్నారు .

మీడియా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను కొందరు దోషిగా చూస్తున్నారు. తప్పుడు కథనాలు వేసి జరిగింది తారు మారు చెయ్యకండి ” అంటూ చెప్పుకొచ్చాడు దిలీప్.  అడిషనల్ డీజీపీ బీ సంధ్య, ఎర్నాకులం రూరల్ ఎస్పీ ఏవీ జార్జ్, పెరంబవూరు సర్కిల్ సీఐ బైజూ పావులోస్ లు వీరిని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here