శ్రీ రెడ్డికి అండగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెయిన్ మీడియాలో అలాగే సోషల్ మీడియాలో హాట్టాపిక్ గా మారింది హిరోయిన్ శ్రీరెడ్డి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు ఇవ్వడం లేదని…ఇండస్ట్రీ పెద్దలపై దర్శకులపై నిర్మాతలపై అలాగే వారి కుమారుల పై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ…అవకాశాలు ఇప్పిస్తామని అమ్మాయిలను వాడుకుంటున్నా సదరు వ్యక్తుల ఫోటోలను వీడియోలను బయటపెడుతూ సంచలనం రేపుతోంది శ్రీరెడ్డి.
దీంతో శ్రీరెడ్డి ఇండస్ట్రీ పై చేసిన వ్యాఖ్యలతో ‘మా’ అసోసియేషన్ తీవ్రంగా కండించింది. శ్రీ రెడ్డి చర్యలను కండిస్తూ ఆమె మా సభ్యత్వాన్ని రద్దు చేసారు. ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి హైద్రాబాద్ లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కి వెళ్ళింది. ఆ తరువాత విద్యార్థి సంఘాల నాయకులను కలిసిన శ్రీరెడ్డి అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా శ్రీ రెడ్డి స్పందిస్తూ .. ఒక అమ్మాయి ఏడిస్తే ఎవరు ఊరుకోరని ఉస్మానియా విద్యార్థులు నిరూపిస్తున్నారని పేర్కొంది.
పరిశ్రమలో తనలాంటి వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా శ్రీ రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ జే.ఏ.సి అండగా నిలిచింది. జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీ లో కులపిచ్చి సంఘాలు..కుటుంబ ఆధిపత్యం ఎక్కువ అని ఆరోపించారు. ఈ క్రమంలో “మా” అసోసియేషన్ పై విరుచుకుపడ్డారు జెఏసి నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here