జగన్ అభిమానులకు శుభవార్త

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పై ఉన్న సీబీఐ కేసులు ఒక్కక్కటిగా న్యాయస్థానాలు ముందు విగిపోతున్నయి. జగన్ మీద ఉన్న కేసులన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపు కేసులే అని తేలిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఐఏఎస్ మాజీ అధికారి, అప్పటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి మురళిధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సీబీఐ దర్యాప్తు సంస్థ పై చీవాట్లు పెట్టింది.
అంతేకాకుండా అక్ర‌మ ఆస్తుల కేసుల అభియోగాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన ఆధారం నిరూపించ‌కుండా ఐఏఎస్ స్థాయి అధికారుల‌ను ఇలా కోర్టులో నిల‌వ‌డేలా చేయ‌డంలో మీ ఆంత‌ర్యం ఏమిట‌ని హైకోర్టు సీబీఐ అధికారుల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది.  అయితే, వైఎస్ జ‌గ‌న్‌పై న‌మోదైన 11 ఛార్జిషీట్ల‌లో ఇప్ప‌టికే తొమ్మిది వీగిపోగా.. మిగిలిన రెండు ఛార్జిషీట్ల‌లో కూడా జ‌గ‌న్ నిర్దోషిగా, క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు రావ‌డం ఖాయమ‌ని అటు న్యాయ‌వాదుల‌తోపాటు.. ఇటు సీబీఐ అధికారులే బాహాటంగా చెబుతున్నారు.
ఈ విష‌యం తెలిసిన వైసీపీ శ్రేణులు ..జగన్ తప్పు చేయలేదు కాబట్టి జనంలోనే ఉన్నారు అని అన్నారు. ఖచ్చితంగా తన తండ్రి రాజశేఖరరెడ్డి ఎలా పరిపాలించాడో..అంతకంటే మెరుగ్గా జగన్ పరిపాలిస్తాడు అని ధీమా వ్యక్తంచేస్తున్నారు వైసిపి శ్రేణులు. జగన్ పరిపాలనలో ప్రతి పేదవాడు సమృద్దిగా భయం లేకుండా చక్కగా బతుకుతారు అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here