జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్

వైసీపీ అధినేత జగన్ పై విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇటీవల ఓ మీడియా చానల్ కి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మాట్లాడుతూ…ట్లాడుతూ.. జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌ట్టిన శ‌ని అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో నేను ఓడిపోతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా.. అదే నేను గెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి త‌ప్పుకుంటావా అంటూ వైఎస్ జ‌గ‌న్‌కు స‌వాల్ విసిరారు జ‌లీల్ ఖాన్‌.
ఏంటేంటి.. ఎంపీల చేత రాజీనామా చేయించే ద‌మ్ము నీకుందా..! అంటూ సీఎం చంద్ర‌బాబుకే స‌వాల్ విసిరుతావా..?? అస‌లు ద‌మ్ము అనే ప‌దం నీ నాలుక ప‌ల‌క‌డానికి కూడా స‌రిపోద‌ని జ‌గ‌న్‌ను ఎద్దేవ చేశారు జ‌లీల్ ఖాన్‌. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి జ‌గ‌న్‌పై, త‌న‌పై ఉన్న కేసుల మాఫీ కోసమే ప్ర‌ధాని చుట్టూ తిరుగుతున్నార‌ని జ‌లీల్‌ఖాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి చంద్రబాబు అభివృద్ధికి పట్టం కట్టి …జగన్ ని జైలు కూడా తినిపిస్తారు అని జోస్యం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here