బాలకృష్ణ మహేష్ బాబు కలిసి నటిస్తున్న సినిమా?

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఎన్టీఆర్ బయోపిక్ గా తెరమీద ఆవిష్కరిస్తున్ననాడని మనకందరికీ తెలుసు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కృష్ణ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడని ఇండస్ట్రీలో నుండి వార్తలు వినబడుతున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ సినిమా పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభం అయిందని మనకందరికీ తెలుసు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు అప్పట్లో హీరోలుగా క్రేజ్ తెచ్చుకున్న అక్కినేని, కృష్ణ, ఎంజీఆర్ లాంటి వాళ్ళు కూడా కనిపిస్తారట. అందులో ఎంజీఆర్ పాత్రకోసం ఇప్పటికే ఓ నటుడిని ఎంపిక చేసారు. తాజాగా హీరో కృష్ణ పాత్రలో అయన తనయుడు మహేష్ ని నటింప చేయాలనీ తేజ ప్లాన్ చేసాడట. ఈ విషయం పై ఇప్పటికే తేజ, మహేష్ ని సంప్రదించాడని , దానికి మహేష్ కూడా ఓకే అని చెప్పాడని టాక్. ఒకవేళ ఈ సినిమాను నిజంగా మహేష్ నటిస్తే మాత్రం సినిమాకు మరో అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. మరోవైపు ఈ సినిమాను మాత్రం వచ్చే ఎన్నికల కంటే ముందే విడుదల చేయాలనుకుంటున్నాడు బాలకృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here