దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ గురుంచి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

సూచి లీక్స్ లాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొని ఇండస్ట్రీ రంగాలపై దర్శకులపై నిర్మాతలపై అలాగే మిగతా వారిపై అసభ్యకరంగా మాట్లాడుతూ..పాపులరైన శ్రీరెడ్డి..తాజాగా ఇండస్ట్రీ పెద్దల లలో ఒకరిగా పేరు గాంచిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ కి సంబంధించిన వీడియోస్ బయటపెట్టి సంచలనం సృష్టించింది.
తాజాగా ఓ స్టూడియో ఛానల్ లో చర్చకు వచ్చిన శ్రీ రెడ్డి మాట్లాడుతూ, అభిరామ్ పేరును ఇప్పటి వరకు తాను చెప్పలేదని తెలిపింది. ‘అరేయ్ అభిరామ్ నీకు సిగ్గుందా?’ అని అడుగుతున్నానని ఫైర్ అయింది. స్టూడియోలో నీవు ఎలా వాడుకున్నావో నీకు తెలుసు అంటూ బాంబు పేల్చింది. తనను ఎలా ముద్దాడుతున్నాడో ఫొటోలో చూడాలని… ఇప్పుడు సురేష్ బాబు కొడుకును బయటకు లాగాలని డిమాండ్ చేసింది. ఇలాంటి వ్యక్తులను ఊరికే వదలకూడదని డిమాండ్ చేసింది.
ఒక ఇండస్ట్రీ కి పెద్దగా వ్యవహరించే ఆయన  కొడుకు… పొట్టకూటి కోసంఇండస్ట్రీ నమ్ముకుని వస్తున్న అమ్మాయిలను ఇలా వాడుకోవడం సబబేనా అని ప్రశ్నించింది. నాలాంటి వారి జీవితాలతో దగ్గుబాటి అభిరామ్ తన శరీర కోరికలు తీర్చుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఇలాంటివారిని ఊరికే వదిలిపెట్టకూడదని మహిళా సంఘాలను డిమాండ్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here