నా పిల్లలే నా ప్రపంచం: హీరోయిన్ సమంత

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలలో తాజా జంట సమంత నాగచైతన్య జంట. గత సంవత్సరం అక్టోబర్ నెలలో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ప్రస్తుతం సినిమా షూటింగ్లతో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో పిల్లల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది సమంత. ప్రస్తుతం పిల్లల గురించి తాను చైతన్య ఆలోచించడం లేదని అంది. మరి అదే విధంగా పిల్లలు కనడానికి ఓ సమయం అనుకున్నామని తెలిపింది.
ఆ టైమ్‌ వచ్చే వరకు తమ కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నామని చెప్పింది. హీరోయిన్‌ సమంత తల్లి కాబోతోందంటూ ఇటీవల బాగా ప్రచారం జరిగింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించి ఇలా వ్యాఖ్యానించింది. కాగా, ఒక్కసారి తాను తల్లిగా మారితే, ఇక తనకు పిల్లలే ప్రపంచమని తెలిపింది. ప్రస్తుతం మహానటి సినిమా షూటింగ్ లో బిజీగా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here