మహేష్ సినిమా విషయంలో చాలా బాధపడ్డాను: డైరెక్టర్ సుకుమార్

డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ కలయికలో వచ్చిన రంగస్థలం సినిమా భారీ విజయం సాధించడంతో సినిమా యూనిట్ మంచి జోష్ మీద వుంది. ప్రస్తుతం రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ క్రమంలో ఇటీవల సుకుమార్ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ…”మహేశ్ తో చేసిన ‘1 నేనొక్కడినే’ ప్లాప్ అయినప్పుడు మీరెలా ఫీలయ్యారు?” అనే ప్రశ్న సుకుమార్ కి ఎదురైంది.  
అందుకాయన స్పందిస్తూ ” 1 నేనొక్కడినే’ సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను అనుకున్నాను. అలా జరగకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. మొదటి నుంచి కూడా నేను సినిమా తీసే విధానం చాలా కష్టతరంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేయలేను. ఒక సినిమా చేస్తున్నంత సేపు మనసంతా దానిపైనే ఉంటుంది .. నిద్రకూడా సరిగ్గా పట్టదు. ఒక సినిమా కోసం పడిన కష్టమంతా మరిచిపోయి సంతోషంగా ఉండేది అది హిట్ అయిన రోజునే.
అది హిట్ కాకపోతే మనసుకి ఇంకా కష్టంగా అనిపిస్తుంది. ‘1 నేనొక్కడినే’ సినిమా అలాంటి బాధకి నన్ను గురిచేసింది” అని చెప్పుకొచ్చారు. రంగస్థలం సినిమా విడుదలైనప్పుడు వేల తెల్లవారుజామున 11గంటలకు పడుకున్నాను ఫోన్ స్విచ్చాఫ్ చేశాను. రంగస్థలం సినిమాకి మొదటి టాక్ ఓవర్సీస్ నుండి వచ్చింది….సినిమా అద్భుతంగా ఉందని….మరి మన వాళ్లకు ఎలా ఉంటుందో అనే నేను చాలా కంగారు పడ్డాను….అయితే ఇక్కడ కూడా అనూహ్యంగా సూపర్ హిట్ టాక్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాను ప్రశాంతం గా నిద్రపోయాను అని అన్నారు సుకుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here