జనసేన పార్టీ కార్యాలయం ముందు తోసుకున్న సీపీఎం నాయకులు గేటు సిబ్బంది

జనసేనలో మిత్రపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్ సీపీఎం అధినేత మధుకు విజయ వాడ జనసేన పార్టీ కార్యాలయంలో అవమానం ఎదురైంది. పవన్ కళ్యాణ్ గురువారం నాడు విజయవాడ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనసేన పార్టీ నాయకులతో కార్యకర్తలతో లోన  మంతనాలు జరుపుతున్నారు. అయితే ఇదే సమయంలో వామపక్ష పార్టీలతో కూడా సమావేశం చేయాలని నిర్వహించారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటుగా ఆ పార్టీకి చెందిన నేతలు ఈ సమావేశానికి వచ్చారు .అయితే కార్యాలయం లోపలకి వెళ్ళుతుండగా సెక్యూరిటీ సిబ్బంది వారినీ అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది సమావేశానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని ..లోపలకు అనుమతి లేదని చెప్పారు. దీంతో వారు గేటు ముందే నిలబడి పోయారు. అయితే లోపల  తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారని తెలుసుకున్న తరువాత సిపిఎం నాయకులు లోనికి వెళ్లడానికి ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. గేటు సిబ్బంది కి సిపిఎం నాయకుల మధ్య తోపులాట జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here