అటాక్ చేయ‌నున్న వాన్నాక్రై ను మించిన U I W I X వైర‌స్

వాన్నా క్రై, వాన్నాక్రై 150 ప్ర‌పంచ దేశాల్ని ఏడిపిస్తున్న వైర‌స్. ఈవైర‌స్ ప్ర‌భావంతో భార‌త్ ఆర్థికంగా న‌ష్ట‌పోయింద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈనేప‌థ్యంలో వాన్నా క్రై మించిన వైర‌స్ మ‌రోసారి దాడి చేయ‌డానికి సిద్ధంగా ఉంద‌ని చైనా జాతీయ కంప్యూటర్‌ వైరస్‌ ఎమెర్జెన్సీ ఎస్పాన్స్‌ సెంటర్‌ తెలిపింది. ఈ వైర‌స్ దాడి జ‌రిగే కొన్ని ప్రాంతాల్ని గుర్తించినట్లు స‌మాచారం. U I W I X అనే వైర‌స్ వాన్నా క్రై వైర‌స్ కంటే అప్ డేట్ గా ఉంద‌ని ఒక‌వేళ దాడి  చేస్తే దాన్ని ఆప‌డం ఎవ‌రి వ‌ల్ల సాధ్యం కాద‌ని విశ్లేషిస్తున్నారు.
వాన్నా క్రై మ‌నం దేశంలో 50వేల కంప్యూట‌ర్ల‌లో చొర‌బ‌డి ఎలా డ‌బ్బులు డిమాండ్ చేస్తుందో U I W I X వైర‌స్ కూడా అలాగే డిమాండ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఐటీ నిపుణులు అంటున్నారు. మ‌నందేశంలో అయితే ప‌శ్చిమ బెంగాల్ లో ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న..ఒక్క‌సారి ఎటాక్ అయితే దాని ప్ర‌భావం దేశం మొత్తం ఉంటుందని హెచ్చ‌రిస్తున్నారు. ఒక‌వేళ దాడి జ‌రిగినా, జ‌ర‌గ‌క‌పోయినా త‌మ కంప్యూట‌ర్లు జాగ్ర‌త్త‌గా వాడుకోవాల‌ని, అన‌వ‌స‌ర ఫైళ్ల‌ను ఓపెన్ చేసి ఇబ్బందులు ప‌డొద్ద‌ని కంపెనీ యాజ‌మాన్యాలు త‌మ ఉద్యోగుల‌కు అల్టిమేట్టం జారిచేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here