ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పోటీగా ఎన్నిక‌ల భ‌రిలో ప్ర‌భాస్

ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీగా బాహుబ‌లి ప్ర‌భాస్ రంగంలోకి దిగితున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి టీడీపీ, బీజేపీ అల‌య‌న్స్ మ‌ద్ద‌తు ఇచ్చారు. ఆమ‌ద్ద‌తు వ‌ల్లే ఏపీలో టీడీపీలో అధికారంలోకి రాగా అనూహ్య రీతిలో బీజేపీ పుంజుకొని పెద్ద‌మొత్తంలో సీట్ల‌ను సంపాదించుకుంది. అయితే ప‌రిస్థితి మారింది. తాను ఎవ‌రి మ‌ద్ద‌తు లేకుండా 2019 ఎన్నిక‌ల్లో పోటీచేయాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు.
ఇన్నీ రోజులు త‌మ‌కు అండ‌గా ఉన్నాడ‌ని భావించిన టీడీపీ బీజేపీలు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో డైల‌మాలో ప‌డ్డారు. ప‌వ‌న్ పోటీచేస్తే గెల‌వ‌డం ప‌క్కా అని విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. ఆ అంచ‌నాను తారుమారు చేయాల‌ని ప్ర‌య‌త్నించిన బీజేపీ కొత్త అస్త్రాన్ని తెర‌పైకి తెచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంది. ఆ అస్త్రం ఎవ‌రో కాదు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. బాహుబ‌లి తో ప్ర‌పంచ దిగ్గ‌జాల స‌ర‌స‌న చేరిన ప్ర‌భాస్  బీజేపీ త‌రుపున పోటీచేస్తే బాగుంటుంద‌ని పార్టీ అధిష్టానం క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.
ప‌వ‌న్ ను ప‌డ‌గొట్ట‌గ‌లిగిన మొన‌గాడు ప్ర‌భాసేన‌ని గుర్తించిన క‌మ‌లం నేత‌లు పెదనాన్న కృష్ణంరాజుతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు పొలిట‌క‌ల్ క్రిటిక్స్ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ప్ర‌భాస్ బీజేపీ త‌రుపున పోటీ చేయోచ్చు అనేది ఊవాచ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here