ర‌జ‌నీ అన్న ఆ ఒక్క‌మాట‌తో ఓడిపోయిన మాజీసీఎం జ‌య‌ల‌లిత

ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఖ‌రారైందా..పాలిటిక్స్ పై ఈనెల 19న త‌లైవా ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారా. త‌మ పార్టీలోకి రావాల‌ని కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ లు గాలం వేస్తున్నాయా..దీన్ని ఖండిస్తూ అభిమానులు సొంత పార్టీ పెట్టాల‌ని అభిమానులు కోరుకుంటున్నారా . పార్టీ పెడితే గెలుస్తాడా అంటే అవున‌నే అని పిస్తోంది త‌లైవా మాటల్ని చూస్తుంటే  ర‌జ‌నీ కాంత్ ఈనెల 19న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం పై ప్ర‌క‌ట‌న చేస్తార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.
ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడుకు చెందిన కాంగ్రెస్, డీఎంకే, బీజేపీలు త‌మ‌ పార్టీలో  చేరాల‌ని త‌లైవాకు  గాలం వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీన్నిర‌జ‌నీ సున్నితంగా తిర‌స్క‌రించ‌డంతో 2019లోగా పార్టీని స్థాపించి, క్యాడ‌ర్ ను స‌న్నంద్ధం చేసి గెలుస్తాడా అని ఎద్దేవా చేసిన‌ట్లు స‌మాచారం. అయితే దీన్ని ఖండించిన ఆయ‌న అభిమానులు ర‌జ‌నీ స్టామీనా ఎంటో చూడండని 20ఏళ్ల క్రితం ర‌జ‌నీ మాట‌తో  త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఎలా ఓడిపోయిందో చూడండ‌ని చెబుతున్నారు.
  అప్పట్లో తమిళనాట జయను గెలిపిస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడంటూ రజనీ ఘాటుగా వ్యాఖ్యానించారు..  ఆదెబ్బకు డిఎంకె సంకీర్ణం ఎన్నికల్లో బంపర్ మెజారిటీ తో గెలిచింది.జయలలిత ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.. రజనీ మాటకు విలువెంత అన్నడానికి ఈ ఒక్క సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here