జాకీర్ నాయక్ ని నిషేధించబోతున్న మరో దేశం .. షాక్ ల మీద షాక్ లు :

ఇస్లాం మతాన్ని బోధించే వ్యక్తిగా జాకీర్ నాయక్ అత్యంత వివాదాస్పద వ్యక్తి కూడా. ఇస్లాం పేరుతో టెర్రరిజాన్ని ప్రేరేపిస్తున్నారు అనే వ్యాఖ్యల మీద ఆయన మీద ఎన్నో దేశాల్లో నిషేధం ఉంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ మధ్య కాలం లో ఆయన మాటలు జనాలకి చేరకుండా చేస్తోంది. ఈ నేపధ్యం లో ఇతర దేశాలలో తన మత బోధ చేస్తూ వచ్చిన జాకీర్ నాయక  కి లెబెనాన్ లో పెద్ద అవమానమే జరిగింది. జాకీర్ తమ దేశం లో అడుగు పెట్టడానికి వీలు లేదు అంటూ లెబెనాన్ లో కొందరు సామాజిక కార్యకర్తలు భారీ ప్రజా ఉద్యమం లేవదీసారు.
స్థానికంగా ఉండే ఒక మత పెద్ద జాకీర్ ని ఆహ్వానించి ఉపన్యాసం ఇవ్వాలి అని కోరగా ఈయన దీనికోసం లెబెనాన్ రాబోతున్నారు. జాకీర్ ని ఉగ్రవాదిగా చూడాలి అనీ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిని దేశం లోకి ఎలా రానిస్తారు అనీ గొడవ చేస్తున్నారు కొందరు. జాకీర్ నాయక్ అతివాద మత బోధకుడు అనీ ముస్లిం లు కాని వ్యక్తులకీ ముస్లిం లకీ ఆయన గొడవ పెట్టడం కోసమే వస్తున్నాడు అనీ ఆరోపణలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here