అసలు ఎవరీ రాం నాథ్ కోవింద్ .. తెలుసుకుందాం :

ఎన్డీయే నుంచి ఏ అద్వానీ నో మరొకరినో రాష్ట్రపతి అభ్యర్ధిగా తీసుకుని వస్తారు అని అనుకున్నారు అందరూ కానీ రాం నాథ్ కోవింద్ పేరు బయటకి వస్తుంది అనీ ఒక దళిత వర్గానికి చెందిన నేతకి ఈ స్థాన దక్కుతుంది అని ఊహించలేదు ఎవ్వరూ. సౌమ్యుడుగా , వివాద రహితుడు గా పేరు ఉన్న రాం నాథ్ కి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఉన్న స్నేహమే ఈ పదవి దగ్గర అవ్వడానికి కారణంగా చెబుతున్నారు. ఇదివరకు కాలం లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా కూడా రాం నాథ్ ఒక్కసారి కూడా గెలవలేదు.

1991 లో రాజకీయాలలోకి అడుగు పెట్టిన ఆయన ఘంటాపూర్ లో లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరవాత ఆయన సేవలని బీజేపీ రెండు సార్లు రాజ్యాసభ కి పంపింది . 2007 లో కూడా ఆయన్ని విజయం వరించలేదు. భోగినీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా సరే ఆయనకీ నియోజికవర్గం మీద ఉన్న ఆసక్తి ప్రజల పట్ల అంకితభావం బీజేపీ లో ఒక మంచి వ్యక్తిగా పేరుని ఇచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here