నిశీత్ యాక్సిడెంట్ మరువక ముందరే మరొక యాక్సిడెంట్

రంగారెడ్డి జిల్లాలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు రోజుల క్రితం జరిగిన నిశిత్ ప్రమాదం బ్యాడ్ న్యూస్ నుంచి బయటకి రాక ముందరే ఈ యాక్సిడెంట్ జరగడం మరింత షాకింగ్ గా ఉంది. తుక్కుగూడ సమీపంలోని అవుటర్ రింగు రోడ్డుపై అత్యంత వేగంగా వెళ్లిన వెర్నా కారు డివైడర్ ను ఢీ కొట్టి సినిమాల తరహాలో రోడ్డుపై పల్టీలు కొట్టింది. సీట్లలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు బయటకి పడిపోయారు కూడా. కారు ఆగేసరికి వారి ప్రాణాలు పోయాయి అంటున్నారు.

వారిని అరుణ్ కుమార్, సాయిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఔటర్ రింగ్ రోడ్డు మీద కుర్రకారు ఇష్టం వచ్చినంత స్పీడు తో కారులు నడపడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here