ఏపీ సచివాలయం .. ఇచ్చట ఎవ్వరూ ఉండరు

సచివాలయం – సెక్రెటేరియట్ పేరు ఏదైనా సరే ఒక రాష్ట్రం యొక్క సర్వ హితం జరిగేది ఇక్కడ నుంచే . ఏ ఫైలు కదలాలి అన్నా ఏ పని నడవాలి అన్నా ఇక్కడ నుంచే ఆర్డర్ పడాలి. కంగారు కంగారు గా హైదరాబాద్ నుంచి అమరావతి కి సచివాలయం మార్పించారు చంద్రబాబు . ఇష్టం లేకపోయినా ఉద్యోగులని సైతం ఇక్కడికి లాక్కొచ్చారు ఆయన. అయితే ఏపీ సచివాలయం ఇప్పుడు పూర్తిగా అదుపు తప్పింది. చంద్రబాబు అమెరికా పర్యటన పుణ్యమా అని ఇక్కడ మొత్తం ఖాలీ అయిపొయింది.
ఇక‌.. వీకెండ్స్ కు కాస్త ముందు నుంచే ఉద్యోగుల హాజ‌రు లేద‌న్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు మ‌ర‌ణించ‌టంతో ఏపీ స‌చివాల‌యం పూర్తిగా బోసిపోయింది. ఆయన ఉంటె ఆయనకీ భయపడి అప్పుడప్పుడు అన్నా హాజరు కోసం కనిపించే మేధావి అధికారులు , ప్రజా ప్రతినిధులు ఇక్కడ ప్రస్తుతం మచ్చుక కి అయినా కాన రావడం లేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here