ఆఫీస్ లో పెళ్ళాన్ని అందరూ చూస్తున్నారు .. మొగుడు ఏం చేసాడో తెలిస్తే మీ కళ్ళు తిరుగుతాయి

బెంగళూరు దగ్గర కొత్తనూరు దగ్గరి బన సంకరి ప్రాంతం లో ఒక ఊహించని ఘటన జరిగింది. ఒరిస్సా కి చెందిన మున్నా – రాదా దంపతులు 15 రోజుల క్రితం ఉపాధి కోసం బెంగళూరు వచ్చారు. నాగేనహళ్లి లో ఒక ఇంట్లోకి అద్దెకి దిగిన ఈ దంపతులు ఒక ప్రైవేటు కంపెనీ లో హౌస్ కీపింగ్ పనికి ఫిక్స్ అయ్యారు. ఆ ఆఫీస్ లో ప్రతీ ఒక్కరూ ఆమె ని రోజూ ఆబగా చూస్తున్నారు అనీ రోజూ ఆమె అనేకమంది తో మాట్లాడుతోంది అని అతనికి కోపమొచ్చింది.

ఇదే విషయం మీద అతను భార్యతో గొడవ కూడా పడ్డాడు. రాత్రి గొడవ అయ్యాక నిద్ర పోయిన మొగుడూ పెళ్ళాలు మళ్ళీ ఉదయం ఆఫీస్ కి సిద్దం అవుతున్న టైం లో ఇదే విషయం ఎత్తి గొడవ పడ్డారు.  అందంగా ఉండడంతోనే ఆఫీసులో అంతా తన భార్యను చూస్తున్నారని, ఆమె అందవిహీనంగా ఉంటే ఎవరూ చూడరని చెబుతూ, భార్య కంటిని కత్తితో మడ్డిగా పీకేసి, అక్కడి నుంచి ఉడాయించాడు. దగ్గర లోని వారు అందరూ వచ్చి బాప్టిస్ట్ చర్చ్ ఆసుపత్రి లో జేర్చారు. మొగుడు పరారీ లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here