పదివేల తో తెలంగాణా ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ

తెలంగాణా రాష్ట్రం లో ఉండి దేవాలయాలు ముఖ్యంగా తిరుపతి వెంకన్న ని దర్సనం చేసుకోవాలి అనుకునేవారికి తెలంగాణా ప్రభుత్వం సూపర్ ఆఫర్ ఇస్తోంది .. హైదరాబాద్ నుంచి తిరుమల కి విమానం లో తీసుకెళ్ళి కేవలం గంట గ్యాప్ లో దర్సనం చేయించి దగ్గరలోంచి దేవాలయాలని సైతం చూపించి రాత్రికి రాత్రి హైదరాబాద్ జేర్చే ప్రోగ్రాం కోసం ప్రత్యెక ప్యాకేజీ ని సిద్దం చేసింది తెలంగాణా టూరిజం సంస్థ.

వేసవి లో పర్యాటకం పెంచడం కోసం టూరిజం శాఖ పదివేల తో ఒక రోజు పదమూడు వేల రూపాయలతో రెండు రోజుల ప్యాకేజీ ప్రాటించింది. ఇదే ప్యాకేజీ లో ప్రయాణం, దర్శనం, భోజనం, వసతి అన్నీ ఈ ధరలో ఇమిడి ఉంటాయి. ఉదయం ఆరున్నర కి హైదరాబాద్ లో బయలుదేరి ఎనిమిది గంటలకి రేణిగుంట విమానాశ్రయం లో దిగుతారు. అక్కడి నుంచి 9:30కు తిరుమల చేరుకునే యాత్రికులకు, ఉదయం 12:30 గంటల్లోపు దర్శనం, 3 గంటల వరకూ భోజనం, విశ్రాంతి, ఆపై తిరుచానూరు అమ్మవారి దర్శనం ఇలా సాగుతుంది ప్రయాణం. ఐదున్నర ప్రాంతం లో రేణిగుంట లో విమానం ఎక్కి ఎనిమిదింటికల్లా హైదరాబాద్ చేరుకుంటుంది. రెండు రోజుల ప్యాకేజీ అయితే భోజన విరామం తో రెండు రోజుల ప్యాకేజీ ఇస్తారు. ఈ కార్యక్రమం శ్రీకాళ హస్తి తో పాటు కాణిపాకం మీదుగా తిరుమల కి సాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here