బాహుబలి 2 సందడి మొగల్తూరు లో .. ఫాన్స్ పెద్ద ప్రోగ్రామ్స్ :

బాహుబలి 2 సినిమా విడుదల హడావిడి తెలుగు రాష్ట్రాలతో బాటు ఇండియా వైడ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరో ప్రభాస్ ఒంత ఊరైన మొగల్తూరు లో కూడా ఈ సినిమాకి సంబంధించి హడావిడి ఉండడం మామూలే . అయితే ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ఇంటి దగ్గర కోలాహలం చేస్తున్నారు. మొగల్తూరు సెంటర్ , జానకి త్రత్రే తో పాటు అనేక చోట్ల పెద్ద పెద్ద ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసారు. పాతపాడు గ్రామం నుంచి నరసాపురం వరకూ రేపు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అన్నదాన కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరం కూడా సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు మొగల్తూరు ఫాన్స్. ప్రభాస్ నివాసం, పాత కాలువ, గాంధీ బొమ్మల సెంటర్, స్థానిక థియేటర్ల వద్ద భారీ కేక్ కట్ చేస్తామని, తీన్ మార్ డప్పులు, వాయిద్యాలతో విజయ యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఈ ప్రోగ్రాం ఆఖరు లో హాజరు అవ్వబోతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here