'బాహుబలి 2: ది కంక్లూజన్' మూవీ రివ్యూ

దర్శకత్వం : ఎస్.ఎస్ రాజమౌళి
నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
సంగీతం : ఎమ్.ఎమ్ కీరవాణి
నటీనటులు : ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్
ప్రభాస్ – రాజమౌళి ల కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి మొదటి భాగం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయం తో దేశవ్యాప్తం గా తెలుగు సినిమా ఖ్యాతి గడించింది. ఇప్పుడు అదే బాహుబలి కి రెండో భాగంగా వచ్చిన బాహుబలి – ముగింపు ఎలా ఉందొ చూద్దాం. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన దగ్గర నుంచే విపరీతమైన క్రేజ్ ని ఏర్పరచుకుంది. ట్రైలర్ తో అందరినీ ఆశ్చర్యం లోకి నెట్టిన రాజమౌళి విడుదల కి ముందరే వెయ్యి కోట్లు కలక్ట్ చేస్తుంది రా అంటూ ట్రేడ్ వర్గాల చేత అనిపించాడు.
స్టొరీ : మొదటి భాగం లో మహేంద్ర బాహుబలి కి తన తండ్రి అమరెంద్రుడి గురించి చెబుతున్న కట్టప్ప కాలకేయులతో మాహిష్మతి యుద్ధం ముగిసిన తరవాత జరిగిన కథ మొత్తం ఈ రెండో భాగం లో చెప్పుకొస్తాడు. జనం మెచ్చిన నాయకుడిగా కాలకేయుడిని చంపిన యువరాజు గా ఎదిగిన ప్రభాస్ ని మహారాజు ని చెయ్యాలి అని శివగామి కోరుకోగా దానికి అడ్డం పడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు బిజ్జల దేవుడు. త్వరలో విజయదసమి నాడు బాహుబలి మాహిష్మతి పీఠం ఎక్కాల్సి ఉంది అన్న సమయం లో దేశ యాటన కోసం బయలుదేరతాడు బాహుబలి. ఆ యాత్ర లో అనుష్క ని (దేవసేన)ప్రేమిస్తాడు ఆమె తో పాటు ఆమె రాజ్యం లో అనామకుడిగా ఉండిపోతాడు. అదే సమయం లో తన కొడుకు ప్రేమించింది దేవసేన ని అని తెలీక భల్లల దేవుడు కి ఇచ్చి దేవసేన ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని ప్రమాణం చేస్తుంది శివగామి. దేశ యాటన పూర్తి చేసుకుని వచ్చిన బాహుబలి కి విషయం తెలిసి దేవసేన కోసం రాజ్యాధికారం వదులుకుంటాడు. ఆ తరవాత నెమ్మదిగా శివగామి కీ బాహుబలి కీ మధ్యన వైరం మొదలు అవుతుంది అది పెరిగి పెరిగి బాహుబలి కట్టప్ప చేతిలో చనిపోయే వరకూ ఎలా వచ్చింది . . ఆ తరవాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది కథ.
రాజమౌళి విజన్ ఈ సినిమాకి అతిపెద్ద పాజిటివ్ పాయింట్. ఒక డైరెక్టర్ ఎంత లోతుగా ఆలోచించాలో అంతలోతుగా ఆలోచించి ప్రతీ క్యారెక్టర్ నీ ప్రతీ సీన్ నీ అద్భుతంగా తీర్చి దిద్దాడు మౌళి. విజువల్స్ దగ్గర నుంచీ పాటల్లో లిరిక్స్ వరకూ అన్నీ సెట్ అయ్యేలా చూసుకుని కెప్టెన్ ఆఫ్ దీ షిప్ లో టాప్ గా నిలిచాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ సినిమాకి అతి గొప్ప పాయింట్. ప్రతీ ఒక్కరికీ ఈ పాయింట్ లో ఒళ్ళు పులకరించి తీరుతుంది. కూల్ గా వెళుతున్న సినిమా అనుకోని ట్విస్ట్ వల్ల సూపర్ పాజిటివ్ గా మారుతుంది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో వచ్చే యుధ సంన్నివేసాలు న భూతో అన్నట్టు ఉన్నాయి. ఎమోషన్ సీన్ లలో శివగామి , ప్రభాస్ ఇరగ దీసారు . ప్రభాస్ వన్ మ్యాన్ షో తోనే రాజమౌళి కథ మొత్తం నడిపించాడు. అనుష్క తన పరిధి లో అద్భుతంగా చేసింది . ఇతరులు పరవాలేదు అనిపించారు . కీరవాణి మ్యూజిక్ , సెంథిల్ కెమెరా పనితనం అదుర్స్ .
కథ విషయం లో కాస్తంత కంఫూజన్ తో పాటు లాజిక్ లు మిస్ అవ్వడం ఈ సినిమాకి మెయిన్ నెగెటివ్ పాయింట్. అంత తెలివైన, గంభీరమైన శివగామి బిజ్జలదేవుడు చెప్పిన మాటలకి నమ్మి ప్రభాస్ ని ఇబ్బంది పెట్టడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇంకా చాలా చోట్ల సినిమాలో వీ ఎఫ్ ఎక్స్ సరిగ్గా సెట్ అవ్వలేదు. లాజిక్ లు కూడా చాలా చోట్ల ఫెయిల్ అయ్యాయి. కామెడీ ని ట్రై చేసిన రాజమౌళి ఫెయిల్ అయ్యాడు. పైగా కట్టప్ప తో కామెడీ ట్రై చేసి హవ్వ అనిపించుకున్నాడు . క్లైమాక్స్ ఫైట్ చాలా డ్రాగ్ కనిపించింది .
మొత్తం మీద సాధారణ కథ తో కాస్తంత కన్ఫ్యూజ్ చేసే ఈ బాహుబలి ముగింపు సినిమా విజువల్ పరంగా ఒక అద్భుత వింత . ఇండియన్ సినిమా చరిత్ర లో మనం ఎప్పుడూ చూడని , కనీ వినీ ఎరుగని విశేషాన్ని మన ముందర పెట్టాడు రాజమౌళి. యాక్షన్ ఎపిసోడ్ లూ , ఎమోషన్ సీన్ లూ , ఇంటర్వెల్ , కెమెరా పనితనం, పాటలు , ప్రభస్ నటన , మాహిష్మతి సామ్రాజ్యం డిజైన్ ఇలా అనేక కారణాలు ఈ సినిమాని తప్పక చూడాల్సిన లిస్టు లో జేర్చాయి. ఇక బాక్స్ ఆఫీస్ కలక్షన్ ల విషయానికి వస్తే తిరుగులేని చిత్రం గా ఇండియా సినిమా చరిత్ర లో ఇది నిలిచిపోతుంది .
తెలుగుCM.కామ్ రేటింగ్ : 3.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here