ఫేస్ బుక్ లో ఫేక్ ఎకౌంటు ఆ కుర్రాడి ఆత్మహత్య కి కారణం

ఫేక్ ఫేస్ బుక్ ఎకౌంటు ఒక కుర్రాడి నిండు ప్రాణం తీసుకుంది, హైదరాబాద్ లో ఇంజాపూర్ స్కూల్ లో చదువుతున్న 16 సంవత్సరాల సాయి కుమార్ తన జీవితాన్ని బలి తీసుకున్నాడు. హస్తినాపురం నార్త్ ఎక్స్ టెన్షన్ లో నివాసం ఉండే సాయి కుమార్ తన స్కూల్ లోని ఒక టీచర్ పేరుతో ఫేక్ ఎకౌంటు సృష్టించాడు. దాని నుంచి బూతు పోస్ట్ లు పెడుతూ బూతు ఫోటోలు పెడుతూ అతను ఇతర విద్యార్ధుల కి యాడ్ రిక్వస్ట్ లు పెడుతున్నాడు. స్కూల్ మొత్తం ఈ విషయం పాకి ఇతనే ఈ ఎకౌంటు ఓపెన్ చేసాడు అని తెలుసుకుని అందరూ కలిసి అతన్ని నిలదీశారు.

పెద్దలకి తెలిసి పోలీస్ కేసు అయితే గొడవలు జరుగుతాయి అని భయపడి ఇంటర్నెట్ కేఫ్ కు తీసుకెళ్లి ఆ అకౌంట్ ను డిలీట్ చేయించి, విడిచిపెట్టారు. ఇంకోసారి ఇలా చేస్తే బాగోదని హెచ్చరించారు. తన పరువు పోయినట్టు ఫీల్ అయిన అతను ఇంట్లో ఎవరూ లేని టైం లో సూసైడ్ చేసుకున్నాడు.  ఇంట్లో ఎవ్వరూ లేని టైం లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయాడు అతను .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here