ముంబై ఇండియన్స్

గ్రూప్ దశ లో తనకి తిరుగు లేదు అని నిరూపించుకుని ప్లే ఆఫ్స్ లోకి అందరికంటే ముందరే చేరి క్వాలిఫై అయిపొయింది ముంబై ఇండియన్స్ కానీ అందరికీ షాక్ ఇస్తూ పూణే ముంబై ని చావు దెబ్బ కొట్టడం ఊహించని విషయం గ్రూప్ లో టాప్ లో ఉన్న రెండు జట్లకూ ఫైనల్ అవకాశాలు ఉండగా కొలకత్తా హైదరాబాద్ మధ్యన ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలుపు కోసం మళ్ళీ ముంబై అదృష్టం చూసుకోవాలి .అయితే, ఐపీఎల్ లో గత విజేతలను పరిశీలించి వారంతా ఈ సంవత్సరం ముంబైకి ట్రోఫీ అందే అవకాశాలపై పెదవి విరుస్తున్నారు.

ఎందుకంటే, గత ఆరు సీజన్లలో గ్రూప్ దశలో టాప్ లో ఉన్న ఏ జట్టు కూడా ట్రోఫీని అందుకోలేదు కాబట్టి.2011లో జరిగిన ఫైనల్ లో బెంగళూరు (1), చెన్నై (2) జట్లు తలపడగా చెన్నై గెలిచింది. 2012లో కోల్ కతా (2), చెన్నై (4) జట్లు తలపడగా కోల్ కతా ట్రోఫీని సొంతం చేసుకుంది. 2013లో చెన్నై (1), ముంబై (2) ఫైనల్ కు చేరగా ముంబై తొలిసారిగా ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇక 2014 విషయానికి వస్తే పంజాబ్ (1), కోల్ కతా (2) ఫైనల్ లో ఆడగా, కోల్ కతా గెలిచింది. 2015లో చెన్నై (1), ముంబై (2) ఆడగా, ముంబై గెలిచింది. 2016లో బెంగళూరు (2), హైదరాబాద్ (3) ఫైనల్ ఆడగా, హైదరాబాద్ గెలిచింది. సో ఈ లెక్కలో ముంబై కి నో ఛాన్స్ అన్న మాటే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here