పాతబస్తీ సెక్స్ రాకెట్ బట్టబయలు .. నిషా ఖాన్ అరస్ట్ !

హైదరాబాద్ పాతబస్తీ ని కేంద్రంగా చేసుకుని ఒక గ్యాంగ్ సెక్స్ రాకెట్ సాగిస్తోంది. ఆ టీం కి లీడర్ నిషా ఖాన్ చాలా నెలల సెర్చ్ తర్వాత నిషా మొత్తం మీద పోలీసులకి దొరికింది. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఆమె చాలా సార్లు వ్యభిచారం చేస్తూ, నిర్వహిస్తూ పోలీసులకి దొరికి జైలుకి కూడా వెళ్ళొచ్చింది.

పేదింటి అమ్మాయిల తల్లితండ్రులకి డబ్బు ఆశ చూపించి ఆడపిల్లలని కొనేసి వారిని ఈ దారుణమైన పరిస్థితి లోకి లాగడం ఆమెకి అలవాటు. వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ మాట వినకపోతే బెల్ట్ తో కొడుతూ ఉండేది ఆమె. ఆ చెర నుంచి తప్పించుకున్న ఇద్దరు అమ్మాయిలు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టారు.

ఉప్పల్ లోని హ్యాపీ హోమ్స్ లో నిషా ఖాన్ ఉందని, అక్కడే వ్యభిచార గృహాన్ని నడుపుతోందని గుర్తించారు. దాడి చేయగా, ముగ్గురు విటులు, నలుగురు అమ్మాయిలతో కలసి నిషాఖాన్ పట్టుబడింది. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు నిషా ఖాన్ నేతృత్వంలో నడుస్తున్న ఇతర వ్యభిచార గృహాలపై దృష్టిని సారించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here