ఎండలు మండుతున్నాయ్.. ఈ 2 రోజులూ ఇంకా మండుతాయ్

మే రాకముందే.. ఎండలు పీక్స్ లో మండిపోతున్నాయి. పొద్దున 9 దాటిన తర్వాత.. ఇల్లు దాటి బయటికి వెళ్లాలన్నా.. జనం ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. హైదరాబాద్ లో ఇప్పుడే 43 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ముందు ముందు మరింత టెంపరేచర్ పెరగొచ్చని వాతావరణ శాఖ అలర్ట్ చేస్తోంది.

మరీ ముఖ్యంగా.. వచ్చే రెండు రోజుల పాటు.. వడగాడ్పుల తీవ్రత.. తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువే ఉంటుందని అధికారులు కూడా చెబుతున్నారు. తప్పనిసరి అయితేనే.. బయటికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే అడుగు బయటపెట్టాలన్నారు.

ఇప్పటికే.. వడగాడ్పులు.. ఎండ దెబ్బ కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రాణాలు విడిచారు. వృద్ధులు, పిల్లలు.. ఎండ దెబ్బకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. వచ్చే రెండు రోజులతో పాటు.. మే అయిపోయేవరకూ ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here