ఇకపై నీళ్లు తాగి..వాటర్ బాటిళ్లను తినొచ్చు

ప్లాస్టిక్..! పర్యావరణాన్ని దెబ్బతీస్తూ సకలకోటి మానవ మనుగడకు భంగం కలిగిస్తుంది. ముఖ్యంగా మనం వాడే ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన వాటి వ్యర్ధాలు కాలువలు, భూగర్భజలాల్లో కలిసిపోతున్నాయి. దీంతో నీరు కలుషితమై పర్యావరణ సమస్యలు కలుగుతున్నాయి. అంతే కాదు ప్లాస్టిక్ బాటిళ్లలో మంచినీళ్లు తాగడం వల్ల అనారోగ్యసమస్యలు చుట్టుముడుతాయి. మగవారికి సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గుతుంది. అలాంటి ప్లాస్టిక్ ను వాడకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతుంది.

అయితే ప్లాస్టిక్ కానీ , వాటర్ బాటిళ్లతో కానీ ఎటువంటి వాతావరణ సమస్యలు, ఆరోగ్య సమస్యలు లేకుండా బ్రిటన్ కు చెందిన రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు  “Ooho”  అనే పేరుతో బయోడీగ్రేడబుల్ వాటర్ బాటిళ్లను తయారు చేశారు. వీటిలోని నీటిని తాగిన తరువాత పడేయకుండా తినవచ్చు. ఇష్టం లేకపోతే పడేసినా ఎలాంటి హానికరమైన సమస్యలు ఉండవని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here