ఆంజనేయుడి భార్య ఎవరో తెలుసా ?

ఆంజనేయుడి పుట్టిన రోజు  సందర్భంగా దేశవ్యాప్తంగా హనుమాన్ నామస్మరణ మారు మోగుతుంది. తెలువారు జామున నుంచే ఆలయానికి భక్తులు బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి చెప్పాలంటే హైదరాబాద్ లో నెలవై ఉన్న సింకిద్రాబాద్ తాడ్ బండ్ ఆంజనేయస్వామి దేవాలాయానికి ప్రాచుర్యం పొందింది. ఇతరరాష్ట్రాల నుంచి భక్తులు ఈ మారుతిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ దేవాలయం గురించి, అందులో ప్రతిష్టించిన ఆంజనేయుడు గురించి అక్కడ ప్రతిష్టించిన శిలాపలకాలపై క్లుప్తంగా ఉంది. అయితే తాడ్ బండ్ ఆంజనేయస్వామి దేవాలయం ప్రసిద్ధిచెందడానికి ఓ కారణం ఉంది.
 ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆ హనుమంతుడి వైవాహిక జీవితం గురించి ఈ దేవాలయంలో శిలాఫలకాలపై చెక్కించారు. నవ వ్యాకరణంలో చివరి నాలుగు అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్చితంగా గృహస్తుడై ఉండాలని ఇందుకోసం తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని స్వామివారికి గురువైన సూర్యుడు సూచిస్తాడు.
ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు. కానీ ఆపై బ్రహ్మచారిగానే కొనసాగుతాడు. ఇక సువర్చల స్వామి వారి ధ్యానంలోనే తన శేషజీవితాన్ని గడిపేస్తుంది. ఇక్కడ వీరిద్దరి ప్రతిమలు మనకు గోచరమిస్తాయి. కాబట్టే తాడ్ బండ్ ఆంజనేయస్వామి అంత విశిష్టత ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here